Hajj 2024: ఈ ఏడాది మక్కా యాత్రకు వెళ్లి 98 మంది భారతీయులు మృతి, హాజ్ యాత్రలో తీవ్రమైన వేడిగాలుల వల్ల మరణించారని తెలిపిన విదేశాంగ శాఖ
ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మందికి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు ధృవీకరించారు. వీరిలో హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు(Indians) మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది.
పవిత్ర హజ్ యాత్రలో మృత్యుఘోష వినబడింది. ఈ ఏడాది హజ్ యాత్రలో కనీసం 900 మందికి యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని దౌత్యవేత్తలు ధృవీకరించారు. వీరిలో హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 98 మంది భారతీయులు(Indians) మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ నుంచి దాదాపు లక్షా 75 వేల మంది యాత్రికులు మక్కా యాత్రకు వెళ్ళారని తెలిపారు. కాగా గతేడాది 187 మంది యాత్రికులు మరణించారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉష్ణతాపానికి హజ్ యాత్రికులు (Hajj Pilgrims) అల్లాడిపోతున్నారు. తీవ్రమైన వేడికి యాత్రికులు మృత్యువాత పడుతున్నారు. పవిత్ర మక్కా యాత్రలో ఆగని మృత్యుఘోష, 90 మంది భారతీయులతో సహా 900 మంది మృతి, సౌదీ అరేబియాలో దంచికొడుతున్న ఎండలు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)