Farmers ‘Tractor Parade’: ఆగస్టు 15న రైతుల భారీ ట్రాక్టర్ పరేడ్, హర్యానాలోని జింద్ జిల్లాలో రైతు జెండాలతో పాటు జాతీయ జెండాలను ఎగురవేసి నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు
మహిళా రైతులు ముందుండి చేపట్టనున్న ఈ పరేడ్‌కు సంబంధించి రైతులు రిహార్సల్స్ నిర్వహించారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్యానాలోని జింద్ జిల్లాలో భారీ ట్రాక్టర్ పరేడ్ నిర్వహించనున్నారు. మహిళా రైతులు ముందుండి చేపట్టనున్న ఈ పరేడ్‌కు సంబంధించి రైతులు రిహార్సల్స్ నిర్వహించారు. రేపటి ర్యాలీలో 5000 వాహనాల్లో 20,000 మంది రైతులు (5,000 vehicles and 20,000 farmers) పాల్గొంటారని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ట్రాక్టర్లపై రైతు జెండాలతో పాటు జాతీయ జెండాలను ఎగురవేసి వ్యవసాయ పరికరాలు, పనిముట్లను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆగస్ట్ 15ను రైతులు కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ దినంగా పాటిప్తారని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిల్లా, తాలూకా స్ధాయిలో తిరంగా మార్చ్‌లు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు. ఇక ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలు సింఘు, టిక్రి, ఘజీపూర్‌లోనూ తిరంగా మార్చ్‌లను రైతులు చేపడతారని కిసాన్ మోర్చా పేర్కొంది.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)