Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ఇదిగో, మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు
మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది.
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది.హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం 90 స్థానాలకు అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది. అయితే, జమ్మూకశ్మీర్‌లో భారీ స్థాయిలో బలగాలను మోహరించే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరుగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుకే జమ్మూకశ్మీర్, హరియాణా రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది. మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..
Here's News