దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మొత్తం 90 స్థానాలకు గాను సెప్టెంబర్ 18 (24 స్థానాలకు), 25న (26 స్థానాలకు), అక్టోబర్ 1న (40 స్థానాలకు) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను అక్టోబర్ 1 న పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మళ్ళీ మోగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే, నేడే షెడ్యూల్ ప్రకటన
Here's Updates
Assembly poll in J&K will be held in three phases, with voting on Sep 18, Sep 25, and Oct 1
Counting of votes on October 4 pic.twitter.com/XXvtq4ReEU
— ANI (@ANI) August 16, 2024
Haryana to vote on October 1; counting of votes on Oct 4 pic.twitter.com/PHC4OWy8qR
— ANI (@ANI) August 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)