New Delhi, August 16: లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) నేడు షెడ్యూల్ విడుదల కానుంది.మధ్యాహ్నం 3 గంటలకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించనుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.ఇక పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. ఈడీ కొత్త బాస్‌గా రాహుల్ నవీన్, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి
మహారాష్ట్ర, హర్యానా విధానసభల పదవీకాలం నవంబర్ 3, నవంబర్ 26తో ముగియనుంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం మాత్రం వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది.ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గతంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో 107 స్థానాలు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. వీటిలో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో జమ్ము ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి