Haryana Violence: శివాలయంలో చిక్కుకుపోయిన 3 వేల మంది, హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలతో పరిస్థితి ఉద్రిక్తం..
విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా హింస చేలరేగడంతో ఓ వర్గానికి చెందిన దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది స్థానికంగా ఉన్న నల్హార్ శివాలయంలో చిక్కుకున్నారని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు.
హర్యానాలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. ఇవాళ ఉదయం నూహ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ (VHP) నిర్వహించిన ర్యాలీ ఘర్షణలకు కారణమైంది. వీహెచ్‌పీ ర్యాలీపై మరో వర్గం వాళ్లు రాళ్లు విసరారు. దాంతో వీహెచ్‌పీ కార్యకర్తలు కూడా వారిపై రాళ్ల దాడి చేశారు. ఇరువర్గాలు పోటీపడి కనిపించిన వాహనానికల్లా నిప్పుపెట్టారు.
విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా హింస చేలరేగడంతో ఓ వర్గానికి చెందిన దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది స్థానికంగా ఉన్న నల్హార్ శివాలయంలో చిక్కుకున్నారని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు.వారందరినీ కాపాడి ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని హోంమంత్రి చెప్పారు.
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)