Haryana Road Accident: మద్యం మత్తులో స్కూలు బస్సును చెట్టుకు గుద్దిన డ్రైవర్, 5 గురు చిన్నారులు మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు

హర్యానా (Haryana)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (GL Public School)కు విద్యార్థులను తీసుకువెళుతున్న బస్సు నార్నౌల్‌ సమీపంలోని ఉన్హాని గ్రామ సమీపంలో పల్టీలు కొడుతూ బోల్తా పడింది.

Five School children Killed As Overloaded Bus Overturns in Mahendragarh District

హర్యానా (Haryana)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పాఠశాల బస్సు (School Bus) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌ (GL Public School)కు విద్యార్థులను తీసుకువెళుతున్న బస్సు నార్నౌల్‌ సమీపంలోని ఉన్హాని గ్రామ సమీపంలో పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోగా సుమారు పది పందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందిదాకా చిన్నారులు ఉన్నట్లు సమాచారం.  ఉగాది వేళ కర్నూలులో తీవ్ర విషాదం, రథం లాగుతుండగా 15 మంది చిన్న పిల్లలకు కరెంట్ షాక్, వీడియో ఇదిగో..

గాయపడిన చిన్నారులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్‌ మద్యం మత్తులో బస్సు నడిపి చెట్టుకు ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆరేళ్ల క్రితం 2018లోనే బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ గడువు ముగిసినట్లు అధికారిక పత్రాల ద్వారా తెలిసిందని వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now