Haryana: అంబాలాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుమంది అనుమానాస్ప‌ద రీతిలో మృతి, కుటుంబ పెద్ద అందరికీ విషం ఇచ్చి ఆ త‌ర్వాత ఉరి వేసుకున్నట్లుగా వార్తలు

అంబాలాలోని బలానా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్య‌క్తులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. మృతిచెందిన వారిలో సంగ‌త్ రామ్‌, భార్య మ‌హింద‌ర్ కౌర్‌, కుమారుడు సుఖ్వింద‌ర్ సింగ్‌, సుఖ్వింద‌ర్ భార్య రినా, వాళ్లు పిల్ల‌లు అషు, జాసిలు ఉన్నారు

Representational Image (Photo Credits: File Image)

హర్యానాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అంబాలాలోని బలానా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్య‌క్తులు అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందారు. మృతిచెందిన వారిలో సంగ‌త్ రామ్‌, భార్య మ‌హింద‌ర్ కౌర్‌, కుమారుడు సుఖ్వింద‌ర్ సింగ్‌, సుఖ్వింద‌ర్ భార్య రినా, వాళ్లు పిల్ల‌లు అషు, జాసిలు ఉన్నారు. సుఖ్వింద‌ర్ త‌న కుటుంబ స‌భ్యుల‌కు విషం ఇచ్చి ఆ త‌ర్వాత అత‌ను ఉరి వేసుకున్న‌ట్లు అనుమానిస్తున్నారు. సుఖ్వింద‌ర్ ఓ ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. పోస్టుమార్ట‌మ్ కోసం మృత‌దేహాల‌ను అంబాలా సిటీ సివిల్ ఆస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు