HC on Dowry Deaths: వరకట్న హత్యలకు పురుషులే కాదు మహిళలు కూడా దోషులే, వరకట్న మరణాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
వరకట్న సంబంధిత మరణాలు కేవలం పురుషుల ఆధిపత్యం, శత్రుత్వాల వల్లే జరగలేదని పేర్కొంది. ఇందులో మహిళలు కూడా భాగమేనని తెలిపింది. తబ భర్తలు పట్ల మహిళలు స్పందిచే విధానంపైన కూడా ఇది ఆధారపడి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
2000 మేలో తన భార్య ఆత్మహత్యకు పాల్పడినందుకుగానూ తన నేరాన్నిఖండిస్తూ, శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ సత్పాల్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది ఢిల్లీ హైకోర్టు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. వరకట్న సంబంధిత మరణాలు కేవలం పురుషుల ఆధిపత్యం, శత్రుత్వాల వల్లే జరగలేదని పేర్కొంది. ఇందులో మహిళలు కూడా భాగమేనని తెలిపింది. తబ భర్తలు పట్ల మహిళలు స్పందిచే విధానంపైన కూడా ఇది ఆధారపడి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
మహిళలు మానసిక వేధింపులకు గురవుతున్నారనే అంశంపై ఢిల్లీ హెచ్‌సి నొక్కి చెబుతూ, "వరకట్న మరణాల ఆందోళనకరమైన నమూనా మహిళలను ఇప్పటికీ ఆర్థిక భారంగా చూస్తున్నారని రుజువు చేసిందని పేర్కొంది. సింగ్ తన భార్య ఆత్మహత్యకు దోహదపడిన కేసులో ట్రయల్ కోర్టు ఆదేశాలను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు, మిగిలిన శిక్షా కాలాన్ని అనుభవించడానికి నిందితుడిని 30 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది.
Heres' Bar Bench Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)