HC on Marital Rape: భార్యను భర్త శృంగారం కోసం బలవంతం చేసినా అది అత్యాచారమే, సంచలన తీర్పును వెలువరించిన గుజరాత్ హైకోర్టు, రేప్‌కు ఎవరు పాల్పడినా అది అత్యాచారమేనని వెల్లడి
భారత్‌లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది.
అత్యాచారానికి భర్తతో సహా ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యను సెక్స్ కోసం బలవంతం చేసినా అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది. మహిళల వెంటపడటం, వేధించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం, ఈవ్ టీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగారభరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నది. పురుషుడు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినా, అత్యాచారం చేసినా ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం శిక్షార్హుడని ఉత్తర్వుల్లో పేర్కొంది.
డబ్బు కోసం అశ్లీల వెబ్‌సైట్లలో వీడియోలను పోస్టు చేసేందుకు కోడలి పట్ల క్రూరంగా వ్యవహరించడం, బెదిరింపులకు గురిచేయడంతో పాటు భర్త, కుమారుడితో ఆమెపై అత్యాచారం జరిపించి నగ్నంగా చిత్రీకరించినందుకు అరెస్టయిన భర్త, ఆమె కొడుకుతో పాటు ఓ మహిళకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ దివ్యేశ్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
Here's Bar Bench Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)