Prisoner Dies of Cardiac Arrest: యూపీ జైలులో గుండెపోటుతో ఖైదీ మృతి, హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరిస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణలు

యూపీ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందినట్లు సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. అయితే ఉమేష్ సింగ్ (37)ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ రమాకాంత్ దోహ్రే తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని బఘ్రాయ్ ప్రాంతానికి చెందిన ఉమేష్ మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.

Representative Photo (Photo Credit: PTI)

యూపీ జైలులో అండర్ ట్రయల్ ఖైదీ గుండెపోటుతో మృతి చెందినట్లు సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. అయితే ఉమేష్ సింగ్ (37)ను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ రమాకాంత్ దోహ్రే తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని బఘ్రాయ్ ప్రాంతానికి చెందిన ఉమేష్ మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నైని జైలు నుంచి 2022 మార్చిలో ఖైదీని ఇక్కడికి తరలించినట్లు ఆయన తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (తూర్పు) విద్యాసాగర్ మిశ్రా మాట్లాడుతూ ఉమేష్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement