IMD Heatwave Alert: పలు రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అలర్ట్ చేసిన ఐఎండీ

భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది

Representational picture. (Photo credits: PTI)

భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఇండియా మ్యాప్‌ను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ఇందులో హీట్‌వేవ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను హైలెట్ చేసింది. పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయని, ఒడిషా, తూర్పు ఉత్తరప్రదేశ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వేడి తరంగాలకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. హీట్ వేవ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వెల్లడించడం మాత్రమే కాకుండా.. హీట్ వేవ్ పరిస్థితుల్లో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఐఎండీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.  తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్..

మీకు దాహం లేకపోయినా మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు/ఓఆర్ఎస్ తాగండి.

వేడి ఎక్కువగా ఉండటం వల్ల 12 గంటల నుంచి 4 గంటల వరకు బయట చేయాల్సిన పనిని కొంత వాయిదా వేసుకోండి.

వేడి నుంచి తప్పించుకోవడానికి నీడగా ఉండే ప్రదేశాల్లో నిలబడండి.

పిల్లలు, వృద్దులు, జబ్బుపడిన వారిని ఎండ వేడి నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి.

ఎండ సమయంలో లేత రంగు బట్టలను ధరించండి.

తలను కప్పుకోవదానికి గుడ్డ, టోపీ వంటి వాటిని ఉపయోగించాలి.

Here's IMD Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement