Human Trafficking Cases: మనుషుల అక్రమ రవాణా కేసు, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ మెరుపు దాడులు, ఓ వ్యక్తి అరెస్ట్, మరో వ్యక్తి పరారీలో..
8 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూలో ఓ మయన్మార్ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపుర, అస్సాం, బెంగాల్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్, కశ్మీర్, పుదుచ్చరిలో తనిఖీలు కొనసాగుతున్నాయి.
మనుషుల్ని అక్రమ రవాణా (Human Trafficking) కేసులో ఇవాళ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టింది. 8 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూలో ఓ మయన్మార్ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపుర, అస్సాం, బెంగాల్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్, కశ్మీర్, పుదుచ్చరిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. జమ్మూలోని బతిండి ఏరియాలో తెల్లవారుజామున రెండు గంటలకు జాఫర్ ఆలమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తేలింది. మయన్మార్ శరణార్థులు ఉన్న బస్తీల్లో సోదాలు జరుగుతున్నాయి. పాస్‌పోర్ట్ యాక్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఘటనలతో లింకు ఉన్న కేసుల్లో తనిఖీలు చేస్తున్నారు.
Here's News