Tamilnadu Shocker: మద్రాస్ ఐఐటీలో వరుస ఆత్మహత్యలు, నాలుగు నెలల్లో నలుగురు విద్యార్ధులు సూసైడ్, తాజాగా ఉరేసుకొని చనిపోయిన మరో స్టూడెంట్
చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు.
Chennai, April 21: మద్రాస్ ఐఐటీలో (IIT Madras) వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. చెన్నైలోని ఐఐటీ క్యాంపస్ లో తాజాగా సెకండియర్ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్యకు (student dies by suicide) పాల్పడ్డాడు.క్యాంపస్ లోని తన రూంలో ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటివరకు మద్రాస్ ఐఐటీలో నలుగురు విద్యార్ధులు సూసైడ్ (Suicide) చేసుకున్నారు. 2018 నుంచి 12 మంది చనిపోయారు. తాజాగా ఈ నెల 2న కూడా బెంగాల్ కు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడు మరో స్టూడెంట్ చనిపోవడంతో వరుస మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)