COVID in India: దేశంలో కరోనా సునామి..ఒక్కరోజులోనే లక్ష దాటిన కేసులు, గత 24 గంటల్లో 1,17,100 కోవిడ్ కేసులు నమోదు, కరోనా బారిన పడి 302 మంది మృతి
భారత్‌లో గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36, 265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్‌ను విడుదల చేసింది.

గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30, 836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3, 43, 71, 845 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్‌లో 4, 83, 178 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా 149 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. ఇదిలా ఉంటే 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని, అందులో 1,199 మంది పేషెంట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)