Coronavirus in India: తగ్గుతున్న యాక్టివ్ కేసులు, దేశంలో 1,37,416 మందికి కొనసాగుతున్న చికిత్స, తాజాగా 12,516 కరోనా కేసులు నమోదు, నిన్న ఒక్కరోజే 501 మంది మృతి
నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. యాక్టివ్ కేసులు 267 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు.
దేశంలో నిన్న 12,516 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. యాక్టివ్ కేసులు 267 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,37,416 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,62,690కి పెరిగింది. నిన్న 53,81,889 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు వాడారు. నిన్న 11,65,286 కరోనా పరీక్షలు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)