Covid in India: దేశంలో పూర్తిగా అదుపులో కరోనావైరస్, గత 24 గంటల్లో 215 కొత్త కేసులు, ప్రస్తుతం దేశంలో 4,982 యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది.తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు ఇవే కావడం విశేషం. 2020 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.

Coronavirus Outbreak in China (Photo Credits: PTI)

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది.తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండేళ్లలో ఒక రోజులో నమోదైన కనిష్ఠ కొత్త కేసులు ఇవే కావడం విశేషం. 2020 ఏప్రిల్‌ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం కూడా ఇదే తొలిసారి.తాజా కేసులతో దేశంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 4,46,72,068కి చేరింది.

ఇక ఇప్పటి వరకు వైరస్‌ నుంచి 4,41,36,471మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,982 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా ఒకరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,615కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.01శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.80శాతం, మరణాలు 1.19శాతంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.91 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now