Coronavirus: మరోసారి పెరిగిన కరోనా కేసులు, కేరళలో తగ్గని మహమ్మారి తీవ్రత, ఒక్కరోజే 11వేలకు పైగా కరోనా కేసులు నమోదు

భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుతున్నట్లే కనిపించినప్పటికీ, మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 459 మంది మృతిచెందారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇవాళ మరోసారి పెరిగాయి.

Coronavirus-in-India ( photo-PTI)

New Delhi November 19:  భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుతున్నట్లే కనిపించినప్పటికీ, మరోసారి కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 11,106 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 459 మంది మృతిచెందారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇవాళ మరోసారి పెరిగాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కు చేరగా, మరణాలు 4,65,082కు పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,38,97,921 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,26,620 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఊరట కలిగిస్తోంది.

కొత్తగా నమోదైన కేసుల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేరళలో నిన్న 6,111 మంది కరోనా బారినపడ్డారు.

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement