Coronavirus in India: దేశంలో కొత్తగా 13,058 మందికి క‌రోనా, గత 24 గంటల్లో 164 మంది మృతి, ప్ర‌స్తుతం దేశంలో 1,83,118 యాక్టివ్ కేసులు

గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

Coronavirus test (Photo-ANI)

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 13,058 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. గ‌త 231 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. దేశ‌వ్యాప్తంగా 19,470 మంది క‌రోనా నుంచి కోలుకోగా, గ‌డిచిన 24 గంట‌ల్లో 164 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు దేశ‌వ్యాప్తంగా 1,83,118 ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారి సంఖ్య 4,52,454గా ఉన్న‌ది. ఇక క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 98.67 కోట్ల కోవిడ్ టీకా డోసుల‌ను ఇచ్చేశారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)