Coronavirus in India: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 13,091 మందికి కరోనా, గత 24 గంటల్లో 340 మంది మృతి, ప్రస్తుతం 1,38,556 యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు (Coronavirus cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ 11 వేల పైచిలుకు నమోదయ్యాయి, తాజాగా అవి 13 వేలు దాటాయి. ఇవి బుధవారం నాటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health)వెల్లడించింది.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

దేశంలో కరోనా కేసులు (Coronavirus cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ 11 వేల పైచిలుకు నమోదయ్యాయి, తాజాగా అవి 13 వేలు దాటాయి. ఇవి బుధవారం నాటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health)వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13,091 కరోనా (Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరింది.

ఇందులో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,38,556 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,62,189 మంది మృతిచెందారు. గత యాక్టివ్‌ కేసుల సంఖ్య గత 266 రోజుల్లో ఇదే కనిష్టమని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో 340 మంది మరణించాగా, 13,878 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా కేసుల్లో కేరళలోనే సగానికిపైగా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 7,540 కేసులు నమోదవగా, 259 మంది కరోనాకు బలయ్యారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now