IPL Auction 2025 Live

Coronavirus in India: దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్, గత 24 గంటల్లో 13,154 కేసులు నమోదు, 961కి పెరిగిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు (Coronavirus in India) కొత్తగా వెలుగు చూడగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155తో పోలిస్తే 40 శాతం పెరిగాయి. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది.

COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

దేశంలో గడిచిన రెండు రోజుల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు (Coronavirus in India) కొత్తగా వెలుగు చూడగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155తో పోలిస్తే 40 శాతం పెరిగాయి. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా చేయడం వల్ల సోమవారం కేసులు తగ్గి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తోంది.

కనుక వచ్చే కొన్ని రోజుల్లో కేసుల సంఖ్య వాస్తవ పరిస్థితికి అద్దం పట్టనుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 3,900 కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత కేరళలో 2,846 కేసులు, బెంగాల్ లో 1,089 కేసులు, ఢిల్లీలో 923 కేసులు, తమిళనాడులో 739 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఈశాన్య రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో కేసులు అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే పెరిగాయి. కర్ణాటకలో 566, గుజరాత్ లో 548, ఝార్ఖండ్ లో 344, హర్యానాలో 217, తెలంగాణలో 235 కేసుల చొప్పున వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 961కి చేరాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)