Coronavirus in India: దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు, గత 24 గంటల్లో 149 మంది మృతి, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07 శాతం
దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,281 మంది మృతిచెందగా, 29,181 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
దేశంలో కొత్తగా 2528 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,04,005కు చేరాయి. ఇందులో 4,24,58,543 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,281 మంది మృతిచెందగా, 29,181 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 149 మంది మరణించగా, 3997 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాటివిటీ రేటు 0.40 శాతంగా ఉందని చెప్పింది. దేశవ్యాప్తంగా 1,80,97,94,58 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇప్పటికవరకు 78.18 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇందులో నిన్న ఒక్కరోజే 6,33,867 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.