Covid in India: దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు, గత 24 గంటల్లో 30 మంది మహమ్మారికి బలి, రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ

దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

Coronavirus

దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో రోజువారీ పాజివిటీ రేటు 0.84 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,87,71,95,781 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 3,64,210 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది.