Covid in India: దేశంలో స్వల్పంగా పెరిగిన కేసులు, గత 24 గంటల్లో 2,876 మందికి కరోనా, 98 మంది మృతి, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.08 శాతమని తెలిపి కేంద్ర ఆరోగ్యశాఖ

దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది. ఇందులో 4,24,50,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,072 మంది మైరస్‌కు బలయ్యారని, 32,811 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

దేశంలో మంగళవారం 2,568 కేసులు నమోదవగా, కొత్తగా 2,876 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,98,938కి చేరింది. ఇందులో 4,24,50,055 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,16,072 మంది మైరస్‌కు బలయ్యారని, 32,811 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గత 24 గంటల్లో 98 మంది కరోనా రోగులు మరణించగా, 3884 మంది కోలుకున్నారని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.08 శాతమని, 98.72 శాతం బాధితులు కోలుకున్నారని వెల్లడించింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.38 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 1,80,60,93,107 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.