COVID in India: భారత్‌లో తగ్గేది లేదంటున్న కరోనా, గత 24 గంటల్లో 33,750 కోవిడ్ కేసులు నమోదు, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్
నిన్న దేశంలో 33,750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని వివరించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న దేశంలో 33,750 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,846 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. 123 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ప్రస్తుతం 1,45,582 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది.. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,95,407గా ఉందని పేర్కొంది. 4,81,893 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలపిఇంది. ఇప్పటివరకు మొత్తం 1,45,68,89,306 కరోనా వ్యాక్సిన్ల డోసులు వాడినట్లు పేర్కొంది.
ఇక ఆదివారం కొత్తగా 123 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1700కు చేరింది. ఇప్పటివరకు 639 మంది ఒమిక్రాన్ నుండి కోలుకున్నారు. దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధిక భాగం మహారాష్ట్రలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 510 కేసులు నమోదయ్యాయి. తర్వాత ఢిల్లీ 351, కేరళ 156, గుజరాత్ 136, తమిళనాడు 121, రాజస్థాన్ 120, తెలంగాణ 67, కర్ణాటక 64, హర్యానా 63 చొప్పున నమోదయ్యాయి.