Coronavirus in India: భారత్‌లో గత 24 గంటల్లో 37,379 క‌రోనా కేసులు, రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతం, తాజాగా 1,007 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

గత 24 గంటల్లో 37,379 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. నిన్న క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య‌ 124గా ఉంద‌ని చెప్పింది.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 37,379 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నార‌ని పేర్కొంది. నిన్న క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య‌ 124గా ఉంద‌ని చెప్పింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 1,71,830 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్లలో చికత్స పొందుతున్నారు. ఇప్పటివ‌ర‌కు మొత్తం 3,43,06,414 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,82,017గా ఉంది. మొత్తం 1,46,70,18,464 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)