India Coronavirus: ఆగని కరోనా కల్లోలం, ఒక్కరోజే 199 మంది మృత్యువాత, గత 24 గంటల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ, 1,16,86,796కు చేరుకున్న మొత్తం కరోనా కేసుల సంఖ్య, 1,60,166కు చేరుకున్న మృతుల సంఖ్య

దేశంలో గడిచిన 24 గంట‌ల్లో 40,715 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా 29,785 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,16,86,796కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 199 మంది కరోనా కారణంగా మృతి (COVID 19 Deaths in India) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,166కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,11,81,253 మంది కోలుకున్నారు. 3,45,377 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 4,84,94,594 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,54,13,233 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,67,459 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

ఇండియాలో కోవిడ్ కేసుల రిపోర్ట్ :

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement