COVID19: దేశంలో కరోనా కేసుల తాజా అప్‌డేట్ ఇదిగో.. గత 24 గంటల్లో 45 మంది మృతి, కొత్తగా 21,566 మందికి కరోనా, మరో 1,48,881 కేసులు యాక్టివ్‌

దేశంలో రోజువారీ కేసులు 21 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,870 మంది మృతిచెందారు. మరో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో రోజువారీ కేసులు 21 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,870 మంది మృతిచెందారు. మరో 1,48,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 45 మంది కరోనాతో మరణించగా, 18,294 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా యాక్టివ్‌ కేసులు 0.33 శాతం, రికవరీ రేటు 98.47 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నదని పేర్కొన్నది. ఇప్పటివరకు 200 కోట్ల 91 లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement