COVID In India: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన, దేశంలో ఒక్కసారిగా 58,097 కేసులు నమోదు, 534 మంది కోవిడ్‌తో మృతి, 4.18 శాతానికి చేరిన డైలీ పాజిటివిటీ రేటు

ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 15,389కు చేరింది. క‌రోనాతో నిన్న‌ 534 మంది ప్రాణాలు కోల్పోయారు.

Coronavirus in TS (Photo Credits: IANS)

దేశవ్యాప్తంగా మొన్న‌ 37,379 క‌రోనా కేసులు న‌మోదు కాగా, నిన్న ఏకంగా 58,097 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 15,389కు చేరింది. క‌రోనాతో నిన్న‌ 534 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,14,004 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 3,43,21,803కు చేరింది. క‌రోనా మృతుల సంఖ్య మొత్తం 4,82,551కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 147.72 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)