Coronavirus in India: దేశంలో ఇప్పటివరకు 4,76,478 మంది కరోనాతో మృతి, కొత్తగా 343 మరణాలు, గత 24 గంటల్లో 7974 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 6984 కేసులు నమోదవగా, తాజాగా మరో వెయ్యి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7974 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,76,478 మంది మృతిచెందారు.

Coronavirus | Representational Image (Photo Credits: ANI)

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 6984 కేసులు నమోదవగా, తాజాగా మరో వెయ్యి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 7974 కరోనా కేసులు (Covid-19) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,18,602కు చేరింది. ఇందులో 3,41,54,879 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,76,478 మంది మృతిచెందారు. మరో 87,245 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 7948 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 343 మంది చనిపోయారు. కరోనా యాక్టివ్‌ కేసులు 0.25 శాతం ఉన్నాయని, రికవరీ రేటు 98.38 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, బుధవారం ఒక్కరోజే 68,89,025 మందికి టీకాలు ఇచ్చామని తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement