India Coronavirus: భారత్‌లో నిన్న‌ కొత్త‌గా 3,60,960 మందికి కరోనా నిర్ధారణ, 1,79,97,267 కు చేరుకున్న మొత్తం కరోనా కేసుల సంఖ్య, 24 గంటల్లో 3,293 మంది మృతి

భారత్‌లో నిన్న‌ కొత్త‌గా 3,60,960 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,61,162 మంది కోలుకున్నారు.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

భారత్‌లో నిన్న‌ కొత్త‌గా 3,60,960 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,61,162 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,97,267 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 3,293 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,01,187 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,48,17,371 మంది కోలుకున్నారు. 29,78,709 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,78,27,367 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 28,27,03,789 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,23,912 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement