Russia-Ukraine War: భారత ప్రధాని మోదీకి పాక్ మహిళ కృతజ్ఞతలు, అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు సాయం చేశారని వీడియోలో వెల్లడి

కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఉక్రెయిన్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్.

India Rescues Pakistani Student Asma Shafique Stranded in Ukraine (Photo-ANI)

కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో ఉక్రెయిన్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలిక పేరు ఆస్మా షఫీక్. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. కీవ్ లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

‘‘చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్‌లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే, భారత ప్రధానికి కూడా. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’’ అని ఆ వీడియోలో ఆస్మా పేర్కొంది. ఆస్మా ఇప్పుడు పశ్చిమ ఉక్రెయిన్‌కు వెళ్తోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement