India Summons US Diplomat: అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన అమెరికా దౌత్యవేత్త, మీకు తగదంటూ నోటీసులు జారీ చేసిన భారత్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన సీఎం కేజ్రీవాల్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు విదేశాంగ శాఖ ఇవాళ సమన్లు(Diplomat Summoned) జారీ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన సీఎం కేజ్రీవాల్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో అమెరికా యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాకు విదేశాంగ శాఖ ఇవాళ సమన్లు(Diplomat Summoned) జారీ చేసింది. దీంతో ఆమె బుధవారం మధ్యాహ్నం సుమారు 40 నిమిషాల పాటు విదేశాంగ శాఖ ప్రతినిధులను కలిశారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అనవసరమైన ఆశయాలతో చేసే వ్యాఖ్యలు అనారోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తుందని విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది.కేజ్రీవాల్ అరెస్టు విషయాన్ని పర్యవేక్షిస్తున్నామని, ఆ కేసులో స్వేచ్ఛగా విచారణ చేపట్టాలని మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ ప్రక్రియ అనేది వ్యక్తిగత న్యాయవ్యవస్థకు సంబంధించినదని, దానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనవసరం అని విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ కస్టడీలో క్షీణించిన అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం, షుగర్ లెవల్స్ పడిపోయాయని వార్తలు
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)