Team India To Meet PM Modi: వీడియో ఇదిగో, ప్రధాని మోదీతో మరి కాసేపట్లో టీమిండియా భేటీ, అనంతరం అల్పాహార విందు, ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌‌కు చేరుకున్న భారత జట్టు

రెండో టీ20 టైటిల్ గెలిచిన తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమిండియా ఈరోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

Indian Cricket Team reaches 7, Lok Kalyan Marg, to meet Prime Minister Narendra Modi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు భారత క్రికెట్ జట్టు లోక్ కళ్యాణ్ మార్గ్‌ 7కు చేరుకుంది. రెండో టీ20 టైటిల్ గెలిచిన తర్వాత టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో టీమిండియా ఈరోజు ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.బార్బడాస్ నుంచి టీమిండియా సభ్యులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఈ ఉదయం సుమారు 6 గంటలకు ప్రపంచకప్ విజేతలతో న్యూఢిల్లీ‌లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.

అనంతరం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ చేతపట్టుకుని ముందు నడవగా టీమిండియా సభ్యులు ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. గత శనివారం ప్రపంచకప్ గెలిచినప్పటికీ బెరిల్ తుపాను కారణంగా టీమిండియా ప్రయాణం కొన్ని రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీకి చేరుకున్న వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నర్స్, ఎయిర్ పోర్టు ద‌గ్గ‌ర కోలాహలం, స్వదేశంలో అడుగు పెట్టిన వెంట‌నే రోహిత్, కోహ్లీ ఏం చేశారో చూడండి!

రోహిత్ శర్మ బృందం తొలుత ప్రధానిని కలిసి ఆయనతో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం, ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో‌ ముంబైకి బయలుదేరుతారు. నేడు సాయంత్రం అక్కడి వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా సభ్యులకు రూ. 125 కోట్ల నగదు బహుమతిని పంపిణీ చేస్తారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)