Indian Cricket Team

New Delhi, July 04: టీమిండియా స్వదేశానికి (Indian Cricket Team) చేరుకుంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ సాధించిన టీమిండియాకు (Indian Cricket Team) ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రపంచ కప్ (World Cup) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు అన్నారు. భారత క్రికెటర్లు షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం సోమవారమే భారత్ రావాల్సి ఉన్నప్పటికీ తుపాను వల్ల బార్బడోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమానాశ్రయాన్ని మూసి వేయడంతో అక్కడే హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఇప్పుడు తుపాను కాస్త తగ్గడంతో భారత ఆటగాళ్లను అక్కడి నుంచి తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి, తీసుకొచ్చింది.

 

ఇవాళ ఉదయం 6 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో (Airport) టీమిండియా దిగింది. వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్కరిస్తారు. అనంతరం భారత క్రికెటర్లు పలు కార్యక్రమాల్లో పాల్గొని, తమ సొంత నగరాలకు వెళ్తారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలుపొందిన విషయం తెలిసిందే.

 

మోదీతో బ్రేక్‌ఫాస్ట్‌ (Breakfast with Modi) తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా ముంబైకి వెళ్లనున్న భారత జట్టు.. సాయంత్రం విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ముంబైలోని ప్రఖ్యాత నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం దాకా ఓపెన్‌ బస్‌లో ప్రపంచకప్‌ వీరులు విక్టరీ పరేడ్‌లో పాల్గొంటారు.

 

ఇదే విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాను గౌరవించుకునేందుకు విజయోత్సవ ర్యాలీలో భారీగా పాల్గొనండి’ అని ట్వీట్‌ చేశాడు.

 

‘ఈ ఆనంద క్షణాలను మేము మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. మెరైన్‌ డ్రైవ్‌ నుంచి మొదలుకాబోయే విక్టరీ పరేడ్‌లో కలుద్దాం’ అంటూ రోహిత్‌ శర్మ ట్వీట్‌ చేశాడు. ర్యాలీ ముగిశాక బీసీసీఐ ఆధ్వర్యంలో వాంఖడేలో ఆటగాళ్లకు, కోచింగ్‌ సిబ్బందికి చిరు సత్కారం ఏర్పాటు చేసింది. బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీనీ ఇక్కడే అందజేసే అవకాశమున్నట్టు సమచారం.