Two Flights Come Dangerously Close: రన్‌వేపై రెండు విమానాలు దగ్గరగా రావడంతో భయపడిపోయిన ప్రయాణికులు, ఘటనలో విరిగిన ఒక విమానం రెక్క భాగం

రన్‌వే పై రెండు విమానాలు చాలా దగ్గరగా రావడంతో కోలకతా ఎయిర్ పోర్టులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి.దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులకు పెను ముప్పు తప్పింది.

Representative Image (Photo Credit- Wikimedia Commons)

రన్‌వే పై రెండు విమానాలు చాలా దగ్గరగా రావడంతో కోలకతా ఎయిర్ పోర్టులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు ఢీకొన్నాయి.దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్క భాగం విరిగిపోయింది. ఇండిగో విమానంలో ఉన్న ప్రయాణికులకు పెను ముప్పు తప్పింది.

దర్భంగా వెళ్లే ఇండిగో విమానం ట్యాక్సింగ్‌ కోసం ప్రయత్నించింది. అయితే రన్‌వేలోకి ప్రవేశించడానికి క్లియరెన్స్ కోసం ఆగి ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని అది ఢీకొట్టింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కకు, ఇండిగో విమానం రెక్క బలంగా తగిలింది. దీంతో ఎయిర్ విమానం రెక్క భాగం తెగిపోగా, ఇండిగో విమానం రెక్క వంకర పోయింది. ఆ సమయంలో ఇండిగో విమానంలో నలుగురు శిశువులతో సహా 135 మంది ప్రయాణికులన్నారు. ఈ సంఘటన వల్ల దర్భంగా విమానం టేకాఫ్‌ ఆలస్యమైనట్లు ఇండిగో సంస్థ పేర్కొంది.

Here's Pics

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement