IndiGo Airlines: 37 మంది ప్రయాణికుల బ్యాగులను వదిలేసి వెళ్లిన విమానం, అసౌకర్యానికి చింతిస్తూ క్షమాపణలు కోరిన ఇండిగో ఎయిర్‌ లైన్స్‌, వారి చిరునామాలకు వీలైనంత త్వరగా చేరుస్తామని వెల్లడి

ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడ్డారు.

IndiGo Aircraft | Representational Image (Photo Credits: ANI)

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో ఎయిర్‌ లైన్స్‌కు చెందిన 6ఈ 409 విమానం 37 మంది ప్రయాణికులకు సంబంధించిన లగేజీ బ్యాగులను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిన సంగతి విదితమే. ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడ్డారు. ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ తమ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం స్పందిస్తూ ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారికి క్షమాపణలు చెబుతున్నామని పేర్కొంది. జరిగిన పొరబాటు మానవ తప్పిదమని, 37 మంది ప్రయాణికుల బ్యాగులను వారి విశాఖపట్నంలోని వారి చిరునామాలకు వీలైనంత త్వరగా, సురక్షితంగా చేరుస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలియజేసింది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)