IPS vs IAS: ఆ ఇద్దరికీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించిన బసవరాజ్ బొమ్మై సర్కారు

కర్ణాటకలో IPS vs IAS వార్ ముదిరి సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రూపా, సింధూరిలను బదిలీ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతానికి రూపకు, రోహిణి సింధూరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు

D Roopa Moudgil vs Rohini Sindhuri. (Photo Credits: ANI)

కర్ణాటకలో IPS vs IAS వార్ ముదిరి సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇద్దరికీ కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రూపా, సింధూరిలను బదిలీ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతానికి రూపకు, రోహిణి సింధూరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌గా (Commissioner of the Hindu Religious Institutions and Charitable Endowment Department) బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను నియమించింది.

మరోవైపు రూప.. కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా (Managing Director of the Karnataka Handicrafts Development Corporation) పని చేస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారిణి డి భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement