Jaipur Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, మద్యం మత్తులో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనానాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ట్రక్ డ్రైవర్,10 మంది మృతి, 50 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
దేశంలో వరుసగా జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే మూడు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం రాజస్థాన్‌లోని ఫలోడి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ టెంపో రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొనడంతో 18 మంది మృతి చెందారు. దానికి మరుసటి రోజు, సోమవారం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో 19 మంది దుర్మరణం పాలయ్యారు.
ఇంకా ఆ ఘటన షాక్ నుంచి ప్రజలు బయటపడకముందే, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ లోహమండి రోడ్‌పై ఆగి ఉన్న అనేక వాహనాలను బీభత్సంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో ట్రక్ వాయు వేగంతో దూసుకువెళ్లి, అడ్డంగా వచ్చిన వాహనాలను ఢీకొడుతూ ఎలా నాశనం చేసిందో స్పష్టంగా కనిపిస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రారంభ దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ వివరాలు లభించాయి — ట్రక్ డ్రైవర్ అదుపు తప్పిన తర్వాత సగం కిలోమీటర్ దూరం వరకు బ్రేక్ వేయకుండా వాహనాలను ఢీకొడుతూ వెళ్లాడు. ప్రస్తుతం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాలు రోడ్డు భద్రతపై మరింత అవగాహన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.
Jaipur Road Accident:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)