Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Jammu and Kashmir Assembly Elections 2024 Schedule (Photo Credits: LatestLY)

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.జమ్మూ కశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని CEC రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.  మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్‌ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

వాటిలో 74 జనరల్, ఎస్సీ-7, ఎస్టీ-9. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 87.09 లక్షల మంది (జులై 25 నాటికి) ఓటర్లు ఉంటారు. ఇందులో 44.46 లక్షల మంది పురుషులు కాగా, 42.62 లక్షల మంది మహిళా ఓటర్లు. ఇక 3.71 లక్షల మంది మొదటి సారి ఓటర్లు, 20.7 లక్షల మంది యువ ఓటర్లు’ అని రాజీవ్‌ కుమార్‌ వివరించారు. ఓటర్ల తుది జాబితాను 19న అమర్‌నాథ్‌ యాత్ర ముగిన తర్వాత ఆగస్టు 20న ప్రకటించనున్నట్లు తెలిపారు.కాగా జమ్మూకశ్మీర్‌లో భారీ స్థాయిలో బలగాలను మోహరించే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరుగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)