Poonch Road Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 300 అడుగుల లోయలో పడిన టాటా సుమో, ఆరుగురు అక్కడికక్కడే మృతి, మరో 7 మందికి తీవ్ర గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Poonch Road Accident) జరిగింది. పూంచ్‌ జిల్లాలోని బఫ్లియాజ్‌ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) 300 అడుగుల లోతు లోయలోకి ( Car Falls into Gorge in Poonch District) పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది అక్కడికక్కడే మృతిచెందారు.

Snow Fall in Jammu and Kashmir. (Photo Credits: ANI)

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Poonch Road Accident) జరిగింది. పూంచ్‌ జిల్లాలోని బఫ్లియాజ్‌ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) 300 అడుగుల లోతు లోయలోకి ( Car Falls into Gorge in Poonch District) పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరు మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్‌కోట్‌కు చెందిన 13 మంది మోరాహ్‌లో జరిగిన ఓ పెండ్లివేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్‌కోట్‌కు టాటా సుమోలో బయలుదేశారు. అయితే బఫ్లియాజ్‌ వద్ద అదుపుతప్పిన సుమో.. లోయలోకి దూసుకెళ్లింది.మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement