Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు, 9 మంది మృతి, మరో 27 మందికి గాయాలు

దీంతో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో కూడిన బస్సు.. పూంచ్‌ నుంచి గలీ మైదాన్‌ వెళ్తున్నది.

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ (Poonch) జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. 36 మంది ప్రయాణికులతో కూడిన బస్సు.. పూంచ్‌ నుంచి గలీ మైదాన్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో బరారి నల్లా సమీపంలో లోయలో పడిపోయిందని అధికారులు తెలిపారు. స్థానికులతో కలిసి పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపట్టారని, గాయపడినవారిని ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ నిన్హా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)