Jammu and Kashmir: సీఐఎస్ఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ, మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని చద్ధా క్యాంపు సమీపంలో దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు చోటు చేసుకుంది
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని చద్ధా క్యాంపు సమీపంలో దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో సీఐఎస్ఎఫ్‌కు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. బలగాల దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పారిపోయారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)