Jani Master Case: పార్టీకి దూరంగా ఉండాలని జానీ మాస్టర్‌కు జనసేన పార్టీ హైకమాండ్ ఆదేశాలు, అత్యాచార ఆరోపణలతో కొరియోగ్రాఫర్ ఉక్కిరిబిక్కిరి

జానీ మాస్టర్... జనసేనాని పవన్ కల్యాణ్ కు, మెగా కుటుంబానికి సన్నిహితుడిగా పేరుపొందడంతో ఈ విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు జనసేన హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

Choreographer Jani Master (Photo-/X)

టాలీవుడ్ కొరియోగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ పై ఓ యువతి అత్యాచార ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. జానీ మాస్టర్... జనసేనాని పవన్ కల్యాణ్ కు, మెగా కుటుంబానికి సన్నిహితుడిగా పేరుపొందడంతో ఈ విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. జానీ మాస్టర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు జనసేన హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

వీడియో ఇదిగో, సెక్స్‌ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..

జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనందున పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించారు. జనసేన పార్టీ వివాదాల నిర్వహణ విభాగం అధ్యక్షుడు వేములపాటి అజయ్ కుమార్ పేరిట ఈ ప్రకటన వెలువడింది. జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి ఇవాళ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now