Janmashtami 2022: మ‌ధుర‌ బంకీ బిహారీ ఆలయంలో తొక్కిసలాట, ఇద్దరు భక్తుల మృతి, మ‌రో ఏడు మందికి గాయాలు, మంగ‌ళ హార‌తి స‌మ‌యంలో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతో విషాద ఘటన

యూపీలోని మ‌ధుర‌లో ఉన్న ప్ర‌ఖ్యాత బంకీ బిహారీ ఆల‌యంలో శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే శ‌నివారం ఉద‌యం భారీ సంఖ్య‌లో భ‌క్తులు రావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది

Representative Image

యూపీలోని మ‌ధుర‌లో ఉన్న ప్ర‌ఖ్యాత బంకీ బిహారీ ఆల‌యంలో శ్రీ కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. అయితే శ‌నివారం ఉద‌యం భారీ సంఖ్య‌లో భ‌క్తులు రావ‌డంతో అక్క‌డ తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. మ‌రో ఏడు మంది గాయ‌ప‌డ్డారు. తెల్ల‌వారుజామున 1.45 నిమిషాల‌కు మంగ‌ళ హార‌తి స‌మ‌యంలో ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఊపిరి ఆడ‌క ఇద్ద‌రు భ‌క్తులు మృతిచెంది ఉంటార‌ని జిల్లా మెజిస్ట్రేట్ న‌వ‌నీత్ సింగ్ చాహ‌ల్ తెలిపారు. తొక్కిస‌లాట‌లో నోయిడాకు చెందిన 55 ఏళ్ల మ‌హిళ‌తో పాటు జ‌బ‌ల్‌పూర్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement