Jaykumar Gore: మహిళకు న్యూడ్ ఫోటో పంపిన మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్, రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్, ఆరోపణలు ఖండించిన గోర్
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే రాజీనామా చేసిన మరుసటి రోజే , ఒక మహిళను వేధించి, ఆమెఅనుచిత ఫోటోలను పంపారనే ఆరోపణలపై బీజేపీ మంత్రి జయకుమార్ గోర్ (Jaykumar Gore) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు బుధవారం డిమాండ్ చేశాయి.
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే రాజీనామా చేసిన మరుసటి రోజే , ఒక మహిళను వేధించి, ఆమెఅనుచిత ఫోటోలను పంపారనే ఆరోపణలపై బీజేపీ మంత్రి జయకుమార్ గోర్ (Jaykumar Gore) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు బుధవారం డిమాండ్ చేశాయి.కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడేట్టివార్ మాట్లాడుతూ.. మంత్రి మరోసారి ఆ మహిళను బెదిరించారని ఆరోపించారు. ఆ మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించాలని ఆయన పట్టుబట్టారు. ఈ విషయంపై గోర్ గతంలో కోర్టులో క్షమాపణలు చెప్పారని, కానీ మంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆ మహిళను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆరోపణలకు గోర్ స్పందిస్తూ.. నేను కోర్టు నుండి నిర్దోషిని అని తేలింది. దీనిపై నాపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం అభియోగాలు నమోదు చేస్తాను" అని అన్నారు.శివసేన (UBT) నేరుగా గోర్ పేరును ప్రస్తావించి, ఆయనను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేసింది. ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, "స్వర్గేట్ కేసు వెలుగులోకి వస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రియమైన మంత్రి జయకుమార్ గోర్ విషయంలో కూడా ఇప్పుడు అదే విషయం బయటపడుతోంది. ఈ మంత్రి ఒక మహిళను ఎలా హింసించి, వేధించాడనే సమాచారం బయటపడింది. ఆ నిస్సహాయ మహిళ రాబోయే కొద్ది రోజుల్లో విధాన్ భవన్ ముందు నిరాహార దీక్ష చేయనుందని తెలిపారు.
Jaykumar Gore Faces Sex Harassment Allegation
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)