Jharkhand: జార్ఖండ్‌లో రోప్‌వే కేబుల్ కార్‌ ప్రమాదం, ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు, ఇంకా కొనసాగుతున్న రోప్‌వే కేబుల్ కార్‌ ఆపరేషన్

త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది

Air Force

జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుకుంది. త్రికూట్‌ హిల్‌వేలో ఉన్న రోప్‌వే కేబుల్ కార్‌లలో దాదాపు 48 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఘటన జరిగింది. త్రికూట్‌ హిల్‌వే మంచి టూరిస్ట్ డెస్టినేషన్. వందలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ కేబుల్ కార్ స్పెషల్ అట్రాక్షన్. చాలామంది టూరిస్టులు రోప్‌వే కేబుల్ కార్‌లలో ఎక్కుతుంటారు. ఆదివారం సెలవు రోజు కావడంతో చాలామంది కేబుల్ కార్ ఎక్కారు. అయితే, సాయంత్రం ఐదు గంటల సమయంలో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లన్నీ గాలిలోనే నిలిచిపోయాయి.

18 కేబుల్ కార్లు రోప్ వేలకు వేలాడుతున్నాయి. అయితే, సిబ్బంది కొన్ని కార్లలోని టూరిస్టులను ఎలాగోలా బయటకు తీయగలిగారు. అయినప్పటికీ 18 కార్లలో మొత్తం 48 మంది ఇంకా చిక్కుకుపోయి ఉన్నారు. సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు కూడా టూరిస్టులు ఇంకా అలాగే చిక్కుకుని ఉన్నారు. వీరికి ఆహారం, మంచినీళ్లు మాత్రం అందించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టూరిస్టులను క్షేమంగా తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)