Jhelum Boat Accident: జీలం నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, పలువురు గల్లంతు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు
ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది
జమ్ము కశ్మీర్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)