KA Paul on Tirumala: తిరుపతిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోర్టులో పిల్ వేసినట్లు తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత వీడియో ఇదిగో..
తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు.
తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, తిరుమలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాను కోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు.లేకపోతే ఇటలీ ప్రభుత్వం వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లు 34 లక్షలు ఉన్న తిరుపతిని ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
కాగా తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కోర్టుకు ఇప్పటికిప్పుడు సమయం లేదని ధర్మాసనం తెలిపింది. వచ్చే వారం రెగ్యులర్ పిటిషన్ వేసుకోవాలని కేఏ పాల్‌కు హైకోర్ట్ ధర్మాసనం సూచించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)