Kailash Gahlot Corona: ఢిల్లీ రవాణా, న్యాయశాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్‌కు కరోనా, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన మంత్రి, కొవిడ్-19 వ్యాక్సీన్ తొలి డోసు వేయించుకున్న కైలాష్
ఢిల్లీ రవాణా, న్యాయశాఖ మంత్రి కైలాష్ గెహ్లోట్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్- 19 పాజిటివ్ ఉన్నట్టు తేలిందని కైలాష్ గెహ్లోట్ (Kailash Gahlot Corona) ఇవాళ వెల్లడించారు. తనకు సమీపంగా మెలిగిన వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘నాకు కొవిడ్-19 పాజిటివ్ (Kailash Gahlot Tests COVID-19 Positive) ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.
దీంతో నేను ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలుసుకున్న వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను..’’ అని మంత్రి ట్వీట్ చేశారు. కాగా గత బుధవారమే మంత్రి కైలాశ్ కొవిడ్-19 వ్యాక్సీన్ తొలి డోసు వేయించుకున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ తదితరులు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.
Here's Kailash Gahlot Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)